సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్. తన పేరు మీద ఆస్ట్రేలియాలో చదివే భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్నారు. 2019లో ఇది ప్రారంభించారు. షారుఖ్ ఆర్థిక సహాయంతో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్, లా ట్రోబ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఈ స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు. ఇప్పటిదాకా 800 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లా ట్రోబ్ యూనివర్సిటీలో చదువుకోవాలనుకునే విద్యార్థినులు మాత్రమే దీనికి అర్హులు. ఉపకారవేతనం పొందిన వారికి ఈ యూనివర్సిటీలో ఉచితంగా రీసెర్చ్ కోర్సులు చేసే వీలు కల్పిస్తారు. విద్యార్థులకిది మంచి అవకాశమని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.