Shabana Azmi | బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh), ఆలియా భట్ (Alia Bhat) కాంబోలో 2019లో వచ్చిన గల్లీ భాయ్ (Gully boy) సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి కలయికలో వచ్చిన తాజా చిత్రం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’(Rocky Aur Rani Kii Prem Kahaani). అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు కరణ్ జోహర్ (Karan johar) దర్శకత్వం వహించాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత కరణ్ ఈ సినిమాతో మెగాఫోన్ పట్టాడు. ఇక జూలై 28న విడుదలైన ఈ చిత్రం మంచి మౌత్ టాక్‌తో 150 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ లవ్ స్టోరీ కంటే ఒకప్పటి బాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ ధర్మేంద్ర డియోల్ (Dharmendra Deol), షబానా అజ్మీ (Shabana Azmi)లా కెమిస్ట్రీ (బ్రేకప్ స్టోరీ) ఎక్కువ వైరల్ అయ్యింది. కాన్వాల్ లుండగా ధర్మేంద్ర, జామినీ ఛటర్జీగా షబానా అలరించగా.. ఈ సినిమాలో వీరిద్దరికి బ్రేకప్ అయ్యి అనుకోని కారణాలతో విడిపోతారు.. ఇక ఈ సినిమాలో వీరి లవ్ స్టోరీపై షబానా అజ్మీ తాజాగా ఓ పోస్టు పెట్టింది.
1988లో వచ్చిన మూవీ మర్దన్ వాలీ బాత్ (Mardon Wali Baat) సినిమాలో ధర్మేంద్ర డియోల్, షబానా అజ్మీ లీడ్ రోల్స్‌లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ వర్క్ అవుటయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఈ సమయం(1988) లోనే రాకీ ఔర్ రాణీలో కాన్వాల్ (ధర్మేంద్ర), జామినీ (షాబానా) కలిసి ఉండోచ్చు అంటూ షబానా ఇన్‌స్టాలో రాసుకోచ్చింది. దీనికి ఒక ఫోటో జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.