కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
కారేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత కారేపల్లి జిన్నింగ్ మిల్లులో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా...
– సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
– లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు
– ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్
కారేపల్లి, నవంబర్ 13 : కారేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత కారేపల్లి జిన్నింగ్ మిల్లులో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేసే విధంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే ఐటీడీఏ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు,నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులను అందజేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ఈ కార్యక్రమంలో సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాప్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, డీఎల్పీఓ రాంబాబు, తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వరరావు, ఎంపీడీవో బానోత్ పద్మ, ఐసీడీఎస్ సీడీపీఓ కే.ఉమా, ఐకేపీ ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అధికారి బట్టు అశోక్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల మంజుల, బానోతు రామ్మూర్తి, తోటకూరి రాంబాబు, విష్ణువర్ధన్ రెడ్డి, బానోతు దేవలా నాయక్, అడ్డగోడ ఐలయ్య, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

