EPFO : ఈపీఎఫ్‌వో సభ్యులకు ఆ సంస్థ కీలక సూచన చేసింది. రెండు రోజులపాటు ఈపీఎఫ్‌వో సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు తెలిపింది. పోర్టల్‌లో సాంకేతికపరమైన అప్డేట్స్ చేపడుతున్న నేపథ్యంలో జూన్ 26, అర్ధరాత్రి 12.00 గంటల నుంచి జూన్ 28 అర్ధరాత్రి 11.59 నిమిషాల వరకు పోర్టల్‌కు సంబంధించినవ వివిధ సేవలు నిలిచిపోతాయని సంస్థ వెల్లడించింది. పోర్టల్ నిర్వహణా సంస్థ దీనికి సంబంధించిన డాటా బేస్‌ను తన అధీనంలోకి తీసుకుని, పలు సాఫ్ట్వేర్ అప్డేట్లు చేయనుంది.
వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు వేగంగా అందించేందుకే ఈ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. అందువల్ల వినియోగదారులు ఈ పోర్టల్ సేవలు వాడాలి అనుకుంటే సేవలు నిలిచిపోకముందే వినియోగించుకోవాలని సూచించింది. పోర్టల్ తాత్కాలికంగా పని చేయని రోజులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. అయితే, అన్ని సేవలకు సమస్య ఉండకపోవచ్చని, కొన్ని సేవలు మాత్రం రెండురోజులు నిలిచిపోతాయని పేర్కొంది. కొత్త క్లెయిమ్ రిక్వెస్ట్ ఫాంలు సమర్పించడం, క్లెయిమ్ ప్రాసెసింగ్ సర్వీసెస్, మైగ్రేషన్ పీరియడ్‌కు సంబంధించిన క్లెయిమ్‌లు సమర్పించడం వంటివి నిలిచిపోవచ్చు. అయితే, మిగిలిన కొన్ని సేవల్ని పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి.
అవి ఉమాంగ్ యాప్, ఎస్ఎంఎస్, వాట్సాప్, మిస్డ్ కాల్ సర్వీసెస్ వంటివి వినియోగించుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాస్‌బుక్, క్లెయిమ్ స్టేటస్ వంటివి చూసుకోవచ్చు. అత్యవసరంగా పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ చేసుకోవాలనుకునే వారు జూన్ 25, అంటే ఈ రోజు అర్ధరాత్రి లోపే ఫాంలు సమర్పించాలి. త్వరలోనే ఈపీఎఫ్‌వోలో ఏటీఎం విత్‌డ్రా సదుపాయం అందుబాటులోకి రానున్నాయి. అలాగే, సభ్యులకు అకౌంట్లోని అమౌంట్‌పై వడ్డీ ఈ నెలలోనే జమ అయ్యే ఛాన్స్ ఉంది.