Chauhaan | కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అజయ్ దేవ్గన్ కొత్త చిత్రం.. ‘చౌహాన్’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో విడుదల
Chauhaan | బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ కలయికలో రాబోతున్న కొత్త సినిమా ‘చౌహాన్’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.
Ajay Devgn | బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ కలయికలో రాబోతున్న కొత్త సినిమా ‘చౌహాన్’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. విడుదలైన వీడియోలో అజయ్ దేవ్గన్ లుక్ చాలా ఇంటెన్స్‌గా, రగ్డ్గా కనిపించి అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా కాశ్మీర్ పుల్వామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోందని బాలీవుడ్ వర్గాల సమాచారం. మిలిటరీ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోంది. యుద్ధ వాతావరణం, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కట్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఆనంద్ ఎల్ రాయ్ మార్క్ ఎమోషన్స్, అజయ్ దేవ్గన్ కిరాక్ యాక్షన్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో కలవనున్నాయి. జియో స్టూడియోస్‌కు చెందిన జ్యోతి దేశ్‌పాండే, ఆనంద్ ఎల్ రాయ్ కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, హిమాన్షు శర్మ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నీరజ్ యాదవ్ ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు కథను అందిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ‘చౌహాన్’ అజయ్ దేవ్గన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

