మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ జంటగా దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా ‘మాటరాని మౌనమిది’. రుద్ర పిక్చర్స్, పీసీఆర్ గ్రూప్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. థ్రిల్లింగ్ లవ్‌స్టోరి నేపథ్యంగా ఉండనుంది. సోమవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో నాయకా నాయికల పాత్రలకు ముసుగు వేసి చూపించారు. ‘నా గత సినిమా ‘శుక్ర’ ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుంది. ఆ ఉత్సాహంతో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాం. థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమ కథా చిత్రమిది’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : చరణ్, సంగీతం : అషీర్ లూక్.