మోదీకి హోలీ శుభాకాంక్షలు చెప్పిన స్కాట్ మోరిసన్
కాన్బెర్రా: హోలీ పర్వదినం సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

కాన్బెర్రా: హోలీ పర్వదినం సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోను ట్వి
ట్టర్లో పోస్ట్ చేశారు. నమస్తే అంటూ పలుకరించి స్కాట్ మోరిసన్ భారతీయుల హృదయాలను దోచుకున్నారు. ఈ రోజు రంగురంగుల వేడుక ప్రారంభం కావడంతో ఆస్ట్రేలియా ప్రధాని భారతీయ సమాజానికి చాలా హ్యాపీ హోలీ అని శుభాకాంక్షలు తెలిపారు.
‘ హిందూ ఆస్ట్రేలియన్ సమాజానికి.. నా మంచి మిత్రుడు నరేంద్ర మోదీకి, ఈ పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ సంతోషకరమైన, రంగురంగుల హోలీ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో తెలిపారు.
మార్చి 29 న హోలీ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రధానంగా హిందూ పండుగ అయినప్పటికీ.. దీనిని ఇతర మతాల ప్రజలు కూడా జరుపుకోవడం విశేషం. ఈ పండుగ మన దేశంలో వసంత కాలం రాకను సూచిస్తుంది.
భారత ప్రధాని మోదీని ప్రత్యేక మిత్రుడిగా భావిస్తున్న మోరిసన్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ సమావేశం జరుగుతున్నందున మోదీ కోసం ప్రత్యేకంగా సమోసాలు తయారుచేశానంటూ గత ఏడాది మే 31 న ట్విట్టర్లో ఫొటోలు పోస్ట్ చేశారు.
Wishing our Hindu Australian community, my good friend @narendramodi and all the people who are celebrating it, a happy and colourful Holi!
— Hon. Scott Morrison AC (@ScoMo30) March 28, 2021
होली की शुभकामनाएँ। pic.twitter.com/rjz1MA8gHJ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

