అబుదాబి: తొలిసారి ప్రపంచకప్ బరిలోకి దిగిన నమీబియా.. ఉత్కంఠ పోరులో విజయం వైపు నిలిచింది. సూపర్-12 గ్రూప్-2లో భాగంగా బుధవారం జరిగిన పోరులో నమీబియా 4 వికెట్లతో స్కాట్లాండ్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. మిషెల్ లీక్ (44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రూబెన్ (3/17)తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టడంతో స్కాట్లాండ్ కోలుకోలేకపోయింది. లక్ష్యఛేదనలో నమీబియా 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 115 పరుగులు చేసింది. జేజే స్మిత్ (32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖర్లో ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు.
సంక్షిప్త స్కోర్లు
స్కాట్లాండ్: 20 ఓవర్లలో 109/8 (లీక్ 44; రూబెన్ 3/17, ఫ్రైలింక్ 2/10), నమీబియా: 19.1 ఓవర్లలో 115/6 (జేజే స్మిత్ 32 నాటౌట్; లీక్ 2/12).