నలభై కోట్ల ఏండ్ల క్రితం తేల్లు ప్రస్తుతం కుక్కలు ఉన్నంత పెద్దగా ఉండేవట.. అవి సముద్రంలో జీవించేవట.. చైనాలోని నాన్జింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. దక్షిణ చైనా సముద్రం అడుగున ఇటీవల దొరికిన ఓ శిలాజంపై శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించగా అది సముద్రపు తేలుదని తేలింది. శిలాజం దాదాపు మీటరు పొడవు ఉంది. పెద్ద పెద్ద కాళ్లు ఉన్నాయి.