SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
SBI Data Leak : ఎస్బీఐ ఖాతాదారులపై సైబర్ దాడి జరింది. ఈ విషయన్ని ఎస్బీఐ వెల్లడించింది. డార్క్ వెబ్‌లో 3,897 మంది కస్టమర్ల ఖాతాలు హ్యాక్ అయినట్లు కంపెనీ తెలిపింది.
SBI Data Leak : ఎస్బీఐ ఖాతాదారులపై సైబర్ దాడి జరింది. ఈ విషయన్ని ఎస్బీఐ వెల్లడించింది. డార్క్ వెబ్‌లో 3,897 మంది కస్టమర్ల ఖాతాలు హ్యాక్ అయినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఎస్బీఐ కస్టమర్ల ఖాతాదారుల అకౌంట్ల భద్రతపై, జరిగే ఆర్థిక నష్టంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అక్టోబర్ 21, బుధవారం ఈ విషయాన్ని ఎస్బీఐ సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపింది. డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉన్న 3.75 లక్షల రికార్డులు పరిశీలించిన అనంతరం 3,897 మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం లీకైనట్లు వెల్లడించింది.
కస్టమర్ల పేర్లు, జెండర్, మొబైల్ నెంబర్లు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ వంటి సమాచారం అంతా డార్క్‌వెబ్‌లో ఉంది. అంతేకాదు.. కస్టమర్ల బ్రాంచ్, సీఐఎఫ్, ఐడీ, మెటాడాటా, లోన్ వివరాలన్నీ డార్క్‌వెబ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ డాటా లీకేజీ గురించి థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, సెర్ట్-ఇన్ సమాచారం అందించినట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ డాటా లీకేజీ సమాచారంతో ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రొసీజర్‌ను సంస్థ యాక్టివేట్ చేసింది. దీనిపై విచారణ కూడా జరుగుతోంది. అయితే, ఈ సైబర్ దాడి వల్ల బ్యాంక్ ఆర్థిక లావాదేవీలపై, వ్యాపార నిర్వహణ, ఆర్థిక అంశాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఎస్బీఐ వివరించింది.
అలాగే, డాటా లీక్ అయిన కస్టమర్ల ట్రాన్సాక్షన్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించుకోవచ్చని హామీ ఇచ్చింది. ఇక, ఎలాంటి డాటా లీక్ అయిందన్నది నిర్ధరించడానికి పూర్తిస్థాయి సమగ్ర విచారణ అవసరమని ఎస్బీఐ తెలిపింది. ఈ డాటా లీక్ అయినంత మాత్రాన ప్రతి ఖాతా హ్యాక్ అయినట్లు కాదని సంస్థ వెల్లడించింది. అందువల్ల ఖాతాదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని సంస్థ వివరించింది. ప్రస్తుతం లీక్ అయిన డాటా ప్రకారం.. హ్యాకర్లు.. ఆ డాటా ఆధారంగా కస్టమర్లకు బ్యాంకు సిబ్బంది లాగా కాల్ చేసి, వేధించడం చేయవచ్చు. ఎందుకంటే కస్టమర్లకు సంబంధించిన పూర్తి సమాచారం వారి వద్ద ఉంటుంది కాబట్టి.
కస్టమర్లు ఏం చేయాలి..
ఇక, యూజర్లు ఇలాంటి డేటా లీక్ కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండాలి. ఓటీపీ, పిన్, పాస్వర్డ్లు ఎవరితో షేర్ చేసుకోకూడదు. ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన అలర్ట్స్ ఎనేబుల్ చేసుకోవాలి. దీనివల్ల ప్రతి లావాదేవీకి సంబంధించిన సమాచారం అందుతుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వాడాలి. తెలియని వారు బ్యాంకు పేరుతో పంపే వాటిని క్లిక్ చేయొద్దు. లోన్ అకౌంట్లు, క్రెడిట్ కార్డు ఎంక్వైరీలపై అప్రమత్తంగా ఉండాలి. బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలి. అనుమానిత కాల్స్, మెసేజ్‌లపై ఫిర్యాదు చేయాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

