Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Women Carried Guns To Mumbai | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన నిందితులకు గన్స్ అందజేసేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళలు సహకరించారు. ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించినవ వారిద్దరూ గన్స్‌ను ముంబైకు తరలించారు. ఆయుధాల సరఫరా ముఠాకు సంబంధించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన నిందితులకు గన్స్ అందజేసేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళలు సహకరించారు. ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించినవ వారిద్దరూ గన్స్‌ను ముంబైకు తరలించారు. ఆయుధాల సరఫరా ముఠాకు సంబంధించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Women Carried Guns To Mumbai) అమెరికా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిట్, నటుడు టైగర్ ష్రాఫ్‌పై దాడికి బాధ్యత వహించాడు. ఒక ఆడియో సందేశంలో ఈ విషయాన్ని తెలిపాడు.
కాగా, పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఒక నిందితుడైన కునాల్ ఇటీవలే మరో కేసులో బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత హర్యానాలోని హర్సానా గ్రామానికి చెందిన ఒక స్నేహితుడి ద్వారా నటుడు టైగర్ ష్రాఫ్‌పై దాడికి బాధ్యత వహించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిట్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ద్వారా పండిట్‌తో కునాల్ మాట్లాడాడు. పండిట్ ఆదేశాల మేరకు అమృత్సర్ నుంచి ఒక పిస్టల్, 20 కాట్రిడ్జ్‌లను అతడు సంపాదించాడు.

Anil Pandit Of Bishnoi Gang
సుమారు రెండు నెలల కిందట ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధను కునాల్ కలిశాడు. తన కార్యకలాపాల గురించి ఆమెకు వివరించారు. ఆయుధాలను ముంబైకి రవాణా చేయమని ఆమెను ఒప్పించాడు. అక్టోబర్ 15న ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధ, బబితలను ఢిల్లీ రైల్వే స్టేషన్లో కునాల్ దింపాడు. ఆ ఇద్దరు యువతులు ముంబై వెళ్లే రైలు ఎక్కారు. పిస్టల్‌ను రాధ తన బ్యాగ్‌లో దాచింది. ప్రయాణ సమయంలో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ద్వారా ఆ ఇద్దరు మహిళలతో కునాల్ సంప్రదించాడు. అనిల్ పండిట్ సూచనలను వారికి చేరవేశాడు.
అక్టోబర్ 17న రాధ, బబిత ముంబైలోని దాదర్ స్టేషన్‌కు రైలులో చేరుకున్నారు. ఒక హోటల్లో వారు బస చేశారు. ఆ ఉదయం సుమారు 11 గంటలకు ఒక మైనర్ బాలుడు ఆ హోటల్ సమీపానికి వచ్చాడు. పిస్టల్, బుల్లెట్లు ఉన్న బ్యాగ్‌ను రాధ నుంచి తీసుకున్నాడు. అక్టోబర్ 18న సాయంత్రం 7 గంటల సమయంలో హృతిక్, రేహన్, ఫూల్ సింగ్ అనే ముగ్గురు నిందితులు నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపి పారిపోయారు. అయితే కాల్పుల తర్వాత ముంబైలో చిక్కుకున్న ముగ్గురు నిందితులను బయటకు పంపించే ఏర్పాట్లు చేయమని కునాల్‌ను పండిట్ ఆదేశించాడు.

Three Accused In Shooting
అదే రోజు రాధ, బబితా కూడా ఢిల్లీకి తిరిగి వెళ్లేందుకు దాదర్ రైల్వే స్టేషన్లో హరిద్వార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. అక్టోబర్ 20న ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆ ఇద్దరు యువతులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని సోనిపట్‌లో కునాల్, అతడి స్నేహితుడు సుమిత్‌ను అరెస్ట్ చేశారు.
అలాగే నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన నిందితులైన హృతిక్, రేహన్, ఫూల్ సింగ్‌లు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అక్టోబర్ 21న రాజస్థాన్‌లోని కోటాలో ఒక రైలు నుంచి వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన నిందితులంతా 19 నుంచి 23 ఏళ్ల వయస్సున్న వారేనని పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

