యథార్థ ఘటనలతో ‘సత్యభామ’
కొందరు పోలీస్ అధికారుల జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. సత్యభామ పేరు మన పురాణాల్లో చాలా పవర్ఫుల్. అందుకే అదే టైటిల్ పెట్టాం’ అన్నారు దర్శకుడు సుమన్ చిక్కాల.
‘కొందరు పోలీస్ అధికారుల జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. సత్యభామ పేరు మన పురాణాల్లో చాలా పవర్ఫుల్. అందుకే అదే టైటిల్ పెట్టాం’ అన్నారు దర్శకుడు సుమన్ చిక్కాల. ఆయన నిర్ధేశకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సత్యభామ’. శ్రీనివాస రావు తక్కళపల్లి, బాబీ తిక్క నిర్మాతలు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ చిక్కాల చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ కథలో ఎమోషన్, యాక్షన్ రెండు అంశాలుంటాయి. ఓ పర్పస్ను దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నా. కథ వినగానే కాజల్ వెంటనే ఒప్పుకున్నారు. యాక్షన్ పార్ట్ కోసం ఆమె చాలా కష్టపడింది. డూప్‌లేకుండా పోరాటఘట్టాల్లో పాల్గొంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మహిళలను ఆదుకునే పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ పాత్రతో ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో మహిళలకు చక్కటి సందేశం ఉంటుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయొచ్చు. అయితే హైదరాబాద్ నేటివిటీ ఉన్న సినిమా కాబట్టి తెలుగులో విడుదల చేయడం కరెక్ట్ అనుకున్నాం. ప్రస్తుతం కొన్ని కథలు రాస్తున్నా. నా తదుపరి సినిమా వివరాలను త్వరలో వెల్లడిస్తా’ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

