‘దర్శకుడు సుధీర్ ఈ కథ చెప్పిన తీరుని బట్టే బాగా తీస్తాడని నమ్మకం కుదిరింది. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించే సినిమా ఇది. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. టీమంతా పాషన్‌తో పనిచేశారు. సాంకేతికంగా అన్ని రంగాలూ సమర్ధవంతంగా పనిచేశాయి. ఇది చాలా గొప్ప ప్రొడక్ట్ అవుతుంది’ అని నటుడు శివాజీ అన్నారు. ఆయన స్వీయ నిర్మాణంలో నటించిన క్రైమ్ కామెడీ మూవీ ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’. లయ కథానాయిక.
సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈ నెల 12న ఈటీవీ విన్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రిలీజ్ డేట్, సాంగ్ లాంచ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడారు. ఈ సినిమాలో ‘ఉత్తర’గా గుర్తుండిపోయే పాత్ర చేశానని, శివాజీ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారని నటి లయ తెలిపారు.
అందరూ మెచ్చే సినిమా అవుతుందని దర్శకుడు సుధీర్ శ్రీరామ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా నటుడు ప్రిన్స్, ఈటీవీ విన్ ప్రతినిధి సాయికృష్ణ, సింగర్ భోలే షావలి, ‘90s వెబ్‌సిరీస్’ ఫేం రోహన్ కూడా మాట్లాడారు. అలీ, రఘుబాబు, ధనరాజ్, పృథీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రిత్విక్‌రెడ్డి, సంగీతం: రంజిత్ రాజ్, నిర్మాణం: శ్రీ శివాజీ ప్రొడక్షన్స్.