హాయిగా నవ్వించే సినిమా
‘దర్శకుడు సుధీర్ ఈ కథ చెప్పిన తీరుని బట్టే బాగా తీస్తాడని నమ్మకం కుదిరింది. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించే సినిమా ఇది. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. టీమంతా పాషన్‌తో పనిచేశారు.
‘దర్శకుడు సుధీర్ ఈ కథ చెప్పిన తీరుని బట్టే బాగా తీస్తాడని నమ్మకం కుదిరింది. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించే సినిమా ఇది. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. టీమంతా పాషన్‌తో పనిచేశారు. సాంకేతికంగా అన్ని రంగాలూ సమర్ధవంతంగా పనిచేశాయి. ఇది చాలా గొప్ప ప్రొడక్ట్ అవుతుంది’ అని నటుడు శివాజీ అన్నారు. ఆయన స్వీయ నిర్మాణంలో నటించిన క్రైమ్ కామెడీ మూవీ ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’. లయ కథానాయిక.
సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈ నెల 12న ఈటీవీ విన్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రిలీజ్ డేట్, సాంగ్ లాంచ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడారు. ఈ సినిమాలో ‘ఉత్తర’గా గుర్తుండిపోయే పాత్ర చేశానని, శివాజీ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారని నటి లయ తెలిపారు.
అందరూ మెచ్చే సినిమా అవుతుందని దర్శకుడు సుధీర్ శ్రీరామ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా నటుడు ప్రిన్స్, ఈటీవీ విన్ ప్రతినిధి సాయికృష్ణ, సింగర్ భోలే షావలి, ‘90s వెబ్‌సిరీస్’ ఫేం రోహన్ కూడా మాట్లాడారు. అలీ, రఘుబాబు, ధనరాజ్, పృథీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రిత్విక్‌రెడ్డి, సంగీతం: రంజిత్ రాజ్, నిర్మాణం: శ్రీ శివాజీ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

