Samantha Ruth Prabhu… చనిపోతానని అనుకున్నా!

నాగచైతన్యతో విఫల వివాహబంధం గురించి తొలిసారి పెదవి విప్పింది అగ్ర కథానాయిక సమంత. విడాకుల అనంతరం తాను మానసికంగా కృంగిపోయి చనిపోతాననుకున్నానని ..కానీ ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకొని ధైర్యంగా నిలబడ్డానని వ్యాఖ్యానించింది. తన సొంత బలాల్ని చూసి గర్విస్తున్నానని తెలిపింది. ‘ఏదైనా చెడు జరిగితే తొలుత ఆ సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
యథార్థాన్ని అంగీకరించాలి. అప్పుడు మనం విజయం సాధించినట్లే. జీవితం ఎప్పటికీ ముగియని ఓ యుద్ధమని భావిస్తే ఏ సమస్యకు పరిష్కారం దొరకదు. జీవితానికి ఎదురీది పోరాడాల్సిందే. తొలుత నేను చాలా బలహీనురాలినని అనుకునేదాన్ని. కానీ జీవితంలోని కష్టాల్ని ఎదుర్కొన్నప్పుడే నాలోని బలాలేమిటో, నా శక్తిసామర్థ్యాలేమిటో తెలిసొచ్చాయి’ అని సమంత పేర్కొంది. ప్రస్తుతం ఆమె భారీ చిత్రాలపై దృష్టి పెడుతూ కెరీర్లో దూసుకుపోతున్నది. ఇటీవలే పాన్ఇండియా చిత్రం ‘యశోద’ సెట్స్‌మీదకు వెళ్లింది. గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

