
సమంత వ్యవహారం కొద్ది రోజులుగా అభిమానులలో లేనిపోని ఆలోచనలు కలిగిస్తున్నాయి. చైతూతో విడాకులు అంటూ ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు ఈ అమ్మడు ఎవరికి కాంటాక్ట్‌లో కూడా లేదని తెలుస్తుంది. సమంత ప్రస్తుతం హైదరాబాద్‌లో లేదు, చెన్నైలో కూడా లేదని అంటున్నారు. అన్నీ మానేసి సమంత ఎక్కడికో వెళ్లినట్లు సమాచారం. కొద్ది రోజులు తన పర్సనల్ స్టాఫ్‌కి కూడా సమంత సెలవులు ప్రకటించినట్టు తెలుస్తుంది. ప్రశాంతత కోసమే సమంత కొన్ని రోజులు ఏదో స్థలానికి వెళ్లిందని అంటున్నారు. కొద్ది రోజులుగా సమంత ఏదో తెలియని సందిగ్ధంలో ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
అక్కినేని కోడలు సమంత పెళ్లైనప్పటికీ గ్లామర్ షోతో మతులు పోగొడుతున్న విషయం తెలిసిందే.ఈ అమ్మడు కుర్ర భామల మతులు పోయేలా అందాల ట్రీట్ అందిస్తుంది. సమంత ఫ్యాషన్ ఐకన్ గా తనదైన ముద్ర వేస్తూ ఇటీవల హాట్ టాపిక్ గా మారుతోంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్‌తో దర్శనమిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
అల్ట్రా మోడ్రన్ లుక్‌లో సమంత నెటిజన్స్ మతులు పోగొడుతూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ కలర్ డిజైనర్ దుస్తులు ధరించి ముక్కుకి ముక్కెర పెట్టుకుంది. చెవులకి జూకాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆ అందమైన కురులను ఒకే చోట చేర్చి సిగ ముడి వేసిన తీరు డిజైనర్ మేకప్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ క్యూట్ బ్యూటీ పిక్స్ వైరల్‌గా మారాయి.
ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2 చిత్రంతో ప్రేక్షకులని అలరించిన గుణేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంతో బిజీగా ఉంది.ఇటీవల చిత్ర షూటింగ్ పూర్తి చేసి డబ్బింగ్లో పాల్గొనేందుకు సిద్ధమైంది.ఇక విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమాలోను సమంత నటిస్తుంది. ఇటీవల చిత్రం నుండి సమంత లుక్స్ కూడా విడుదలయ్యాయి. ఇవి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇది కూడా చూడండి