PAK Cricket : పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ అఘా(Salman Agha)కు మరో షాక్ తగిలింది. ఇంగ్లండ్ పర్యటనలో మూడో టెస్టుకు స్క్వాడ్ నుంచి అతడిని తప్పించిన బోర్డు.. ఈసారి ఏకంగా కెప్టెన్సీ నుంచి తొలగించింది. టీ20 సారథిగా కొనసాగుతున్న అఘాను పక్కన పెట్టేసిన పీసీబీ.. ఓపెనర్ షహిబ్దజ ఫర్హాన్‌కు బాధ్యతలు అప్పగించింది. శ్రీలంకతో సిరీస్ కోసం సోమవారం స్క్వాడ్ ప్రకటన సందర్భంగా ఫర్హాన్‌ను నయా కెప్టెన్‌గా ఎంపిక చేశారు సెలెక్టర్లు.
తరచూ కెప్టెన్ల మార్పుతో వార్తల్లో నిలిచే పాకిస్థాన్ క్రికెట్లో మరో సంచలనం. టీ20 సారథిగా కొనసాగుతున్న సల్మాన్ అఘాపై వేటు పడింది. శ్రీలంకతో పొట్టి సిరీస్ కోసం సోమవారం సెలెక్టర్లు ఓపెనర్ షహిబ్దజ ఫర్హాన్ సారథిగా తీసుకున్నారు. ఇటీవల వరసగా విఫలవుతున్న అఘా స్థానంలో.. విధ్వంసక ఆటతో అలరించే ఫర్హాన్‌కు పగ్గాలు అప్పగించారు. దాంతో.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ మధ్యలోనే అతడిని స్వదేశానికి సాగనంపిన పీసీబీ ఈసారి కెప్టెన్‌గా తొలగించి పెద్ద షాకిచ్చింది.
Sahibzada Farhan leads Pakistan’s squad for the T20I series against Sri Lanka, with Salman Agha sacked as captain and dropped from the side
Razaullah gets his first international white-ball call-up, while Hasan Nawaz and Naseem Shah return 🇵🇰 https://t.co/JiXruOQdSe
— Cricinfo (@cricinfo) October 5, 2026
ఇంగ్లండ్‌పై అరంగేట్రంలోనే సిక్సర్లతో రికార్డు నెలకొల్పిన పేసర్ రజియుల్లా లంక సిరీస్‌తో టీ20ల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక వన్డేలకు షాహిద్ ఆఫ్రిది సారథ్యంలో 16 మందితో కూడిన పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు.
పాకిస్థాన్ టీ20 స్క్వాడ్ : షహిబ్దజ ఫర్హాన్(కెప్టెన్), ఫఖర్ జమన్, హసన్ నవాజ్, ఇమ్రాన్, ఖవజా నఫే(వికెట్ కీపర్), మాజ్ సదాకత్, నసీం షా, రజియుల్లా, సయీం ఆయుబ్, సల్మాన్ మిర్జా, షాదాబ్ ఖాన్, సూఫియన్ మొఖిం, అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, అరాఫత్ మిన్హస్.
పాకిస్థాన్ వన్డే స్క్వాడ్ : షాహిన్ అఫ్రిది(కెప్టెన్), బాబర్ అజాం, ఫఖర్ జమాన్, ఫహీం అష్రఫ్, హ్యారిస్ రవుఫ్, హసన్ నవాజ్, ఘాజీ ఘోరి(వికెట్ కీపర్), నసీం షా, రజీయుల్లా, సాద్ బైగ్(వికెట్ కీపర్), సయీం ఆయుబ్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, సూఫియన్ మొఖిం, అబ్రార్ అహ్మద్, అరాఫత్ మిన్హస్.
Pakistan name their squad for the upcoming ODI tri-series against England and Sri Lanka, with Shaheen Shah Afridi retaining the captaincy 🇵🇰 https://t.co/hOTa2xeAHm
— Cricinfo (@cricinfo) October 5, 2026