సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో గురువారం ‘ఊసులాడే..’ అనే పాటను విడుదల చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ గీతానికి రిషి ఎం సంగీతాన్నందించారు.
ఆదిత్య, సమీర భరద్వాజ్ ఆలపించారు. ప్రేమబంధంలోని మధురానుభూతులకు అద్దం పట్టే గీతమిదని దర్శకుడు తెలిపారు. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ కథలో చక్కటి సందేశం ఉంటుందని హీరో పేర్కొన్నారు. మీరారాజ్, వినోద్‌కుమార్, వాసు ఇంటూరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రిషి ఎం, రచన-దర్శకత్వం: బత్తుల సతీష్.