అమ్మ నగలమ్మి..
విల్లుని ఎక్కుపెట్టడం, లక్ష్యాన్ని గురిపెట్టడం సాహిల్ జాదవ్‌కి ఎంతో ఇష్టం. ఇతరుల విల్లుని అరువు తెచ్చుకుని సాధన చేశాడు. సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. సెలెక్ట్ అయ్యాడు.
కొడుకు గెలుస్తాడనే ఆశతో వాళ్లమ్మ బంగారు నగలు అమ్మి క్రీడాకారులు ఉపయోగించే ప్రొఫెషనల్ బౌ (విల్లు)ని కొనిచ్చింది. చాలాఏండ్లు సాధన చేశాడు. గెలుపు కోసం ఎదురుచూశాడు. అప్పులు చేశాడు. కానీ గెలుపు రాలేదు. ఇంతకంటే ముందుకు పోలేను అనే నిరాశలో ఆర్చరీని పూర్తిగా వదిలేశాడు.
ఆర్చరీ అంటే విల్లుని ఎక్కుపెట్టి తథేకంగా చూస్తూ గురి కుదర్చడమే కాదు. ఏండ్లపాటు సాధన చేయాలి. గెలుపు కోసం ఎదురు చూడాలి. పేదరికంలో ఉన్న సాహిల్ ఎక్కువ కాలం ఎదురుచూడలేక పోయాడు. విల్లుని వదిలేశాడు. కోచ్, సహచరులు, కుటుంబం తనను ప్రోత్సహించింది. వాళ్లందరి ప్రోత్సాహంతో అకాడమీలో తనను తాను మెరుగులు దిద్దుకుంటూ పోయాడు. తన నగలు అమ్మి విల్లుని చేతికి ఇచ్చిన తల్లికి ఆ కొడుకు ఆసియా క్రీడల నుంచి రెండు బంగారు పతకాలు కానుకగా తెచ్చాడు. కాంపౌండ్ ఆర్చరీ పురుషుల జట్టు, కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో బంగారు పతకాలు గెలవడమే కాదు లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌కి అర్హత సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

