Rules Ranjann | ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రూల్స్ రంజన్ నుంచి థర్డ్ సింగిల్
Rules Ranjann | హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ యువ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్ (Rules Ranjann). డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోండగా.. రుథిరమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
Rules Ranjann | హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ యువ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్ (Rules Ranjann). డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోండగా.. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే నాలో నేనే లేను (Naalo Nene Lenu), సమ్మోహానుడా (Sammohanuda) సాంగ్‌లను లాంఛ్ చేయగా.. అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఆగష్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని ఈ మూవీ నుంచి “ఎందుకురా బాబు” అనే ఫ్రెండ్షిప్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సాంగ్‌ను ఆగష్టు 06 న మధ్యాహ్నం 1:50 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Join the ‘Compromise Club’ and Dance to the beats of #EndukuRaBabu, with the gang of Ranjann! 🎉🕺
Promo ▶️ https://t.co/Ye0nfkSu2M
Celebrate ‘Friendship Day’ with the Full Lyrical Video, out Tomorrow at 1:50 PM ❤️🔥#RulesRanjann @Kiran_Abbavaram @iamnehashetty #HyperAadhi… pic.twitter.com/jwjB0KxyTq
— BA Raju’s Team (@baraju_SuperHit) August 5, 2023
ఈ చిత్రానికి అమ్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్దార్థ్ సేన్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

