‘హైడ్రా’మాలు చాలించి కబ్జాలు ఆపండి
హైదరాబాద్ శివారులో పేదలు, సామాన్యుల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపే హైడ్రా యంత్రాం గం.. అధికార పార్టీ నేత ల అండదండలతో జరుగుతున్న భారీ చెరువు కబ్జాపై ఎం దుకు కండ్లు మూసుకున్నదని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు.
- ‘చెరో విల్లా.. చెరువు గుల్ల’ కథనంపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందన
- సామాన్యులపై బుల్డోజర్లు పంపే హైడ్రా.. కాంగ్రెస్ కబ్జాలపై కండ్లు మూసుకున్నదేం?
- కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే కోహెడ ‘సంఘీ సమ్రాట్ సిటీ’ ఆక్రమణలు
- చెరువు, ఫీడర్ చానళ్లను ధ్వంసం చేసిన ఘటనపై న్యాయ విచారణ జరుపాలి: ఆర్ఎస్పీ
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ శివారులో పేదలు, సామాన్యుల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపే హైడ్రా యంత్రాం గం.. అధికార పార్టీ నేత ల అండదండలతో జరుగుతున్న భారీ చెరువు కబ్జాపై ఎం దుకు కండ్లు మూసుకున్నదని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలోని ‘అంబుజా సంఘీ సామ్రాట్ సిటీ’ పేరిట సహ జ సిద్ధమైన చిన్నచెరువును కబ్జా చేసి విల్లా లు నిర్మిస్తున్న తీరుపై ‘నమస్తే తెలంగాణ’ లో ప్రచురితమైన ‘చెరో విల్లా.. చెరువు గుల్ల..’ కథనానికి మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఈ వెంచర్ వల్ల చెరువు ధ్వంసమైందని ఇరిగేషన్ శాఖ నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం తగదని మండిపడ్డారు.
చిన్నచెరువు ను మింగేస్తున్న వెంచర్‌పై సమగ్ర న్యాయ విచారణ జరిపించి, కబ్జాదారులతోపాటు వారికి కొమ్ముకాస్తు న్న ప్రజాప్రతినిధులపై కఠి న చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. చెరువును మట్టి తో పూడ్చివేసి, బఫర్‌జోన్, ఫీడర్ చా నళ్లను ధ్వంసం చేస్తూ ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా అక్రమ విల్లా ప్రాజెక్ట్ కొనసాగుతున్నదని ‘నమస్తే తెలంగాణ’ ఆధారాలతో బయటపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ, మరో ఎమ్మెల్యేలకు ఇందులో ‘చెరో విల్లా’ ముట్టజెప్పి అక్రమ నిర్మాణాలకు రక్షణ కల్పిస్తున్నారనే ఆరోపణలను ప్రవీణ్‌కుమార్ ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. విదేశాలకు వెళ్లి నదుల పునరుజ్జీవం పై అధ్యయనం చేసి వచ్చిన నేతలే, రియల్ మాఫియాకు అండగా నిలువడం అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

