
చేగుంట, డిసెంబర్ 9 : సీస కమ్మరి నైపుణ్యంతో తయారు చేసిన వ్యవసాయ ముట్లు చౌక ధరలకే అందుబాటులో దొరకడంతో రైతులు ఉత్సాహంతో కొనుగోలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సీస కమ్మరి వృత్తి వారు, వారి పెద్దల నాటి నుంచి సీస కమ్మరి వృత్తిలో స్థిరపడి ఊరూరా తిరుగుతూ తనకు వచ్చిన నైపుణ్యంతో ప్రతి రోజూ రైతులు వ్యవసాయానికి ఉపయోగించే ఇనుప వస్తువులైన కత్తి, కొంకి, కొడవలి, గొడ్డలి, కమ్మ కత్తి, గండ్ర గొడ్డలి, చాకులు, గుణపాలు, సుత్తె, చిమ్మెట, పట్కార్, గడ్డపార, పార వంటి వ్యవసాయ సంబంధిత వస్తువుల తయారీకి ఇనుప రాడ్లను చిమ్మటతో బొగ్గుల మంటల్లో ఇనుమును కరిగించి రైతులకు కావాల్సిన వస్తువులను కండ్ల ముందే తయారు చేసి ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసా యం పెరగడంతో సాగుకు కావాల్సిన పని ముట్లు గతంలో కంటే ఎక్కువ రైతులు వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు కొనుగోలు చేస్తున్నారని తయారీదారులు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఐదు కుటుంబాలకు చెందిన 25మంది మహిళలు, పురుషులు వారు తయారు చేసిన వస్తువులను మండల కేంద్రాల్లో రోడ్లపక్కన పెట్టి అమ్ముతున్నారు. రోజు ఉదయం సాయంత్రం వరకు మహిళలు సైతం బరువైన ఇనుప గన్నును ఎత్తి గనుపం వేసే దెబ్బలతో రైతులకు కావాల్సిన పనిముట్లను తయారు చేసి ఇస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని తమకు తెలంగాణలో ప్రతి రోజూ వ్యవసాయానికి ఉపయోగపడే వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయడంతో మాకు ఏడాది పొడవున చేతి నిండా పనితో పాటు కడుపు నిండా అన్నం దొరుకుతున్నదని, ఇక్కడే తెలంగాణలోనే స్థిరపడాలని అనుకుంటున్నామని సీస కుమ్మరులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం పంటల కోతకు, చెట్లను, ముళ్ల పొదలు, కొమ్మలను కత్తిరించేందుకు కొడవలి, గొడ్డలి, కమ్మకత్తి, ఇండ్ల నిర్మాణాలకు ఉపయోగించే పార, గడ్డపారతో పాటు అనేక రకాల వస్తువులు దుకాణాలు, మార్కెట్లో దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో చేగుంటలో సీస కమ్మరి వారు వ్యవసాయానికి, ఇండ్ల నిర్మాణాలకు ఉపయోగపడే వస్తువులను చౌక ధరలకు విక్రయించడంతో పాటు తక్కువ ధరలకై వస్తువులు తయారు చేసి ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడే స్థిరపడాలని ఉంది..
ఇక్కడే స్థిర పడాలని ఉంది మాకు. మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ భూ మిలేదు. అక్కడ కూలీ కూడా సరి గా దొరకదు. తెలంగాణలో ప్రతి రో జూ చేతి నిండా పని ఉంది. కడుపు నిండా అన్నం దొరుకుతున్నది. ఐదు కుటుంబాల్లో చిన్న పిల్లలు, ముసలోళ్లు కూడా ఉన్నారు.
తక్కువ ధరకే ఇచ్చిన్రు..
వ్యవసాయానికి పనికొచ్చే వస్తువులు దొరక్క అనేక ఇబ్బందులు పడే వా రం. చేగుంటలో, తూప్రాన్, గజ్వేల్ లో కూ డా దొరకని వస్తువులను ఇ క్కడ తయారు చేయించుకున్న. తక్కువ ధరకు మం చిగా చేసి ఇచ్చిన్రు.