జీవితకథల్లో నటించాలి

‘మా కుటుంబంలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. నన్ను వైద్యురాలిగా చూడాలని అమ్మనాన్న కలగన్నారు. కానీ నేను మాత్రం వారి ఊహలకు భిన్నంగా యాక్టర్ అయ్యాను’ అని తెలిపింది కేతిక శర్మ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. ఆకాష్‌పూరి హీరోగా నటించారు. అనిల్ పాదూరి దర్శకుడు. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించారు. ఈ నెల 29న విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్‌లో కేతికశర్మ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ ఢిల్లీ నా స్వస్థలం. నటన పట్ల ఇష్టంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఓ రోజు పూరి కనెక్ట్స్ నుంచి ఫోన్ వచ్చింది. ‘రొమాంటిక్’ ఆడిషన్‌కు రమ్మని పిలిచారు. మౌనిక పాత్రకు సరిపోవడంతో నన్ను ఎంపికచేశారు. సమాజ కట్టుబాట్లతో నిమిత్తం లేకుండా తనకు నచ్చినట్లుగా స్వతంత్య్రంగా జీవితాన్ని గడపాలని అభిలాషించే ఆధునిక యువతిగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. ప్రేమకు పరిమితులు ఉండవని నమ్ముతుంటుంది. కథానాయిక కావాలనే నా కల పూరి జగన్నాథ్ సినిమా ద్వారా నిజం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో హీరోయిన్గా నటిస్తూనే ‘నా వల్ల కాదే’ అనే పాటను పాడాను. పతాక ఘట్టాలు చాలెంజింగ్‌గా అనిపించాయి. రమ్యకృష్ణ లాంటి అనుభవజ్ఞురాలైన నటితో పోటీపడుతూ పరిణితితో కూడిన అభినయాన్ని కనబరచడానికి చాలా కష్టపడ్డా. థ్రిల్లర్ సినిమాలు చాలా ఇష్టం. జీవితకథల్లో నటించాలనుంది. సాయిపల్లవి నా అభిమాననటి. సహజత్వాన్ని కనబరుస్తూ పాత్రలకు ఆమె న్యాయం చేసే తీరు నచ్చుతుంది. ప్రస్తుతం తెలుగులో నాగశౌర్య ‘లక్ష్య’తో పాటు వైష్ణవ్‌తేజ్‌తో మరో సినిమా చేస్తున్నా’ అని చెప్పింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

