Rohit Sharma: రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం.. వరల్డ్‌కప్‌లో సరికొత్త రికార్డు
Rohit Sharma: రోహిత్ శర్మ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వరల్డ్‌కప్ మ్యాచుల్లో అత్యధిక సంఖ్యలో సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. రోహిత్ వరల్డ్‌కప్ మ్యాచుల్లో 50 సిక్సర్లు బాదాడు. విండీస్ బ్యాటర్ గేల్‌ను రోహిత్ దాటేశాడు.
ముంబై: రోహిత్ శర్మ(Rohit Sharma) తన బ్యాటింగ్‌తో థ్రిల్ చేస్తున్నాడు. సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు. వరల్డ్‌కప్‌లో అత్యధిక సంఖ్యలో సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్ మ్యాచుల్లో రోహిత్ ఇప్పటి వరకు 50 సిక్సర్లు బాదేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లో.. రోహిత్ ఇవాళ నాలుగు సిక్సర్లు కొట్టేశాడు. దీంతో వరల్డ్‌కప్ మ్యాచుల్లో అతను కొట్టిన మొత్తం సిక్సర్ల సంఖ్య 50 కు చేరుకున్నది.
🚨 Milestone Alert 🚨
Captain Rohit Sharma has now hit the most sixes in Men’s ODI World Cup 🫡#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/rapyuF0Ueg
— BCCI (@BCCI) November 15, 2023
ఇప్పటి వరకు వరల్డ్‌కప్ మ్యాచుల్లో అత్యధిక సిక్సర్ల సంఖ్య గేల్ పేరిట ఉంది. ఇప్పుడు గేల్‌ను రోహిత్ దాటేశాడు. విండీస్ వీరుడు గేల్ ఖాతాలో 49 సిక్సర్లు ఉన్నాయి. డివిలీర్స్ 37, రికీ పాంటింగ్ 31, మెకల్లమ్ 29 సిక్సర్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.
ఇప్పటికే ఈ వరల్డ్‌కప్‌లో 27 సిక్సర్లు బాదేశాడు రోహిత్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇండియా.. తాజా సమాచారం ప్రకారం 8.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 రన్స్ చేసింది. రోహిత్ శర్మ 47 రన్స్ చేసి ఔటయ్యాడు, గిల్ 21 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. రోహిత్ ఇవాళ 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 47 రన్స్ చేశాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

