RITES Recruitment 2024 | జియో టెక్నికల్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, సివిల్ తదితర విభాగాలలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషనల్ రీసెర్చ్, ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్‌తో MBA పూర్తి చేసి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జనవరి 27 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్
విభాగాలు : జియో టెక్నికల్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, సివిల్ తదితరాలు.
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషనల్ రీసెర్చ్, ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్‌తో MBA పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జనవరి 27
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
వెబ్సైట్ : https://www.rites.com/