న్యూఢిల్లీ: కంప్యూటర్లలో పాత గూగుల్ క్రోమ్ బ్రౌజర్ స్థానంలో కొత్త దాన్ని అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) యూజర్లకు సూచించింది. లేకపోతే, హ్యాకర్లు కంప్యూటర్‌పై సైబర్ దాడులకు పాల్పడి డాటాతో పాటు సిస్టమ్‌ను కూడా ఎప్పటికప్పుడూ ట్రాక్ చేయగలరని హెచ్చరించింది.
హ్యాకింగ్ జరిగే సందర్భాలు
బ్రౌజింగ్, రీడర్ మోడ్, వెబ్ సెర్చ్, థంబ్‌నెయిల్ ట్యాబ్, స్ట్రిప్, స్క్రీన్ క్యాప్చర్, విండో డయలాగ్, పేమెంట్లు, ఎక్స్టెన్షన్లు, యాక్సెసబిలిటీ అండ్ క్యాస్ట్, హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో ఇన్ యాంగిల్, ఫుల్ స్క్రీన్ మోడ్, స్క్రోల్, పాయింటర్ లాక్, వీ8, పాలసీ బైపాస్ ఇన్ కూప్.
ఏ వెర్షన్‌తో ప్రమాదం? దేన్ని వాడాలి
గూగుల్ క్రోమ్ వెర్షన్ 98.0.4758.80 కంటే పాత వెర్షన్లను వాడితే హ్యాకింగ్ జరుగొచ్చు. ఇలా జరుగకుండా ఉండాలంటే క్రోమ్ 98 వెర్షన్లను అప్డేట్ చేసుకోవాలి. విండోస్‌కు 98.0.4758.80/81/82, మ్యాక్ బుక్, లైనక్స్‌కు 98.0.4758.80 వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.