సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : నగరంలో పగలు, రాత్రి వేళల్లో ఉక్కపోతతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలే అందుకు కారణమని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ 34.0, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.9 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 61 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.