Rishabh Pant : కొలంబో టెస్టులో రిషభ్ పంత్(Rishabh Pant) తన మార్క్ విధ్వంసం చూపించాడు. మణికట్టు గాయం నొప్పిని భరిస్తూనే కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్ మెరుపు అర్ధ శతకంతో జట్టు భారీ స్కోర్‌లో భాగమయ్యాడు. తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో శ్రీలంక బౌలర్లను హడలెత్తించిన ఈ చిచ్చరపిడుగు.. స్టేడియం పైకప్పు అద్దాన్ని సైతం పగలగొట్టాడు.
శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలతో శ్రీలంక బౌలర్లను బెంబేలెత్తించిన పంత్ .. స్టేడియం పైకప్పు అద్దాన్ని ముక్కలు చేశాడు. రెండో రోజు తొలి సెషన్లోనే సరాన్ష్ జైన్ ఔటయ్యాక బ్యాటింగ్‌కు వచ్చిన ఈ పంత్.. 90వ ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు.
Rishabh Pant BREAKS the solar panel!
HUGE SIX! he is back on devil mode!A 100 ? This time?#indvssl pic.twitter.com/xNPmwCSclE
— Sunil Gavaskar (@virender_swag) August 24, 2026
లహిరు కుమార సంధించిన బంతిని ఫైన్ లెగ్‌లో పంత్ బాదేయగా.. బంతి నేరుగా వెళ్లి స్టేడియం పైకప్పు మీదపడింది. 95 మీటర్ల ఆ సిక్సర్ ధాటికి అక్కడి సోలార్ రూఫ్ అద్దం పగిలిపోయింది. దాంతో.. లంక ఆటగాళ్లే కాదు కామెంటర్లు, ప్రేక్షకులు షాకయ్యారు. ఇక కామెంటేటర్ రస్సెల్ ఆర్నాల్డ్ అయితే పంత్ ధాటికి స్టేడియంలో ఏసీలు పనిచేయడం లేదు అని జోక్ చేశాడు.
తొలి సెషన్లో లంకబౌలర్లను ఉతికారేసిన పంత్ టెస్టుల్లో 21వ హాఫ్ సెంచరీ సాధించాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన భారత వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ధ్రువ్ జురెల్‌తో కలిసి అతడు శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫలితంగా లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 419 రన్స్ చేసింది. అయితే.. భోజన విరామానికి 63 పరుగులతో ఉన్న పంత్ తర్వాత మొదటి బంతికే ఔటయ్యాడు.
And just like that, Rishabh Pant is back to his old tricks! 😏🔥
Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/JLfk3vXwg0
— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026