Ricky Ponting | కామెంటరీ చేస్తుండగా రికీ పాంటింగ్‌కు గుండెపోటు.. నిలకడగా ఆరోగ్యం
టీ, ఈవెనింగ్ సెషన్ కామెంటరీకి దూరమైన పాంటింగ్
Ricky Ponting : ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడు. పెర్త్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న మొదటి టెస్ట్‌లో కామెంటరీ చేస్తుండగా అతనికి గుండెపోటు వచ్చింది. దాంతో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ వైద్యులు వెంటనే పాంటింగ్‌కు చికిత్స అందించారు. ఆ తర్వాత అతడిని పెర్త్‌లోని ఆస్పత్రికి తరలించారు. ‘పాంటింగ్‌కు అస్వస్థతగా ఉంది. ఈ రోజు టీ, ఈవెనింగ్ సెషన్‌కు అతను కామెంటరీ చేయడం లేదు’ అని ఛానెల్ 7 ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే, ప్రస్తుతం పాంటింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు 7 నెట్వర్క్ ఛానెల్ కామెంటరీ టీమ్‌లో పాంటింగ్ ఒకడు.
పాంటింగ్ 2012లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతడి కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు అత్యధిక విజయాలతో తిరుగులేని శక్తిగా అవతరించింది. పాటింగ్ నాయకత్వంలో ఆసీస్ 77 టెస్టుల్లో 48 విజయాలు సాధించింది. అంతేకాదు మొదటిసారి 1998లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో రికీ పాంటింగ్ సభ్యుడు. ఆ తర్వాత అతని కెప్టెన్సీలో ఆసీస్ 2003, 2007 ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా పాంటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

