గ్యాంగ్‌స్టర్ కథాంశాల్ని తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు రామ్‌గోపాల్‌వర్మ. ‘సర్కార్’ ‘సత్య’ ‘కంపెనీ’ వంటి సినిమాలు హిందీలో సంచలనం సృష్టించాయి. తాజాగా ఆయన ‘ఆర్’ పేరుతో ఓ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను రూపొందించబోతున్నారు. కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర టైటిల్ రోల్‌ని పోషించనున్నారు. ఈ విషయాన్ని రామ్‌గోపాల్‌వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. బెంగళూరుకు చెందిన ఈ ‘ఆర్’ గ్యాంగ్ దేశంలోనే శక్తివంతంగా ఉండేదని..ఎవరికీ భయపడేది కాదని..దుబాయ్‌లో దావూద్ ఇబ్రహీంనే వణికించిందని వర్మ పేర్కొన్నారు. బెంగళూరు పోలీసులు కూడా ‘ఆర్’ బ్యాచ్ అంటే భయభ్రాంతులకు గురయ్యేవారని..వారి సహాయాన్ని కోరేవారని ఆయన ట్విట్టర్లో తెలిపారు.