Irani Cup : భారత వన్డే జట్టులో చోటు కోల్పోయిన రిషభ్ పంత్ (RishabhPant) దేశవాళీ క్రికెట్లో సత్తా చాటాడు. ఆటగాడిగా ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించే పంత్ ఈసారి కెప్టెన్‌గా రెస్టాఫ్ ఇండియా(Rest Of India)కు టైటిల్ అందించాడు. ఇరానీ కప్ (Irani Cup) ఫైనల్లో ముకేశ్ కుమార్(2-84, 33-6) ఎనిమిది వికెట్లతో విరచుకుపడగా.. పంత్ సారథ్యంలోని రెస్టాఫ్ ఇండియా 167 పరుగుల తేడాతో జమ్ము కశ్మీర్‌ను ఓడించింది. దాంతో రికార్డు స్థాయిలో ముప్పయ్యోసారి ట్రోఫీని ముద్దాడింది.
ఇరానీ ట్రోఫీ 2026-27 ఫైనల్లో రెస్టాఫ్ ఇండియా అదరగొట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సనత్ సాంగ్వన్(55) అర్ధ శతకంతో శుభారంభమివ్వగా.. స్మరణ్ రవిచంద్రరన్(135) సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం 279 పరుగుల ఛేదనలో జమ్ము కశ్మీర్ బ్యాటర్లను పేసర్ ముకేశ్ కుమార్ (2-84, 33-6) వణికించాడు.
Rest of India are Irani Trophy champions! 🏆🔥
Scorecard: https://t.co/UURSwEutlz https://t.co/WIYsvtxuDE
— Cricinfo (@cricinfo) October 4, 2026
బుల్లెట్ బంతులతో నిప్పులు చెరిగిన ముకేశ్ ఏకంగా ఆరుగుని ఔట్ చేసి ప్రత్యర్ధిని కోలుకోలేని దెబ్బతీశాడు. దాంతో.. జమ్ము 111 రన్స్‌కే కుప్పకూలింది. ఆల్‌రౌండ్ షోతో కనబరిచి 167 పరుగుల తేడాతో గెలుపొందిన రెస్టాఫ్ ఇండియా 30వ సారి ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది. తద్వారా జట్టుకు ట్రోఫీ కట్టబెట్టిన రెండో వికెట్ కీపర్‌గా పంత్ గుర్తింపు సాధించాడు. ఖతర్నాక్ శతకంతో విజయంలో భాగమైన స్మరణ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
Birthday boy Rishabh Pant lifting the Irani Cup as captain 🐐
Fever tha, phir bhi trophy uthayi…
Yehi toh asli leader hota hai 💙
Tag a friend who is proud of Pant today 👇#RishabhPant #IraniCup https://t.co/x5mtTqPqVH
— CricketIndian_🇮🇳 (@CricketIndian_) October 4, 2026