హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) ఐదేండ్ల(2016-2021) ప్రగతిపై డీజీపీ పట్నం మహేందర్‌రెడ్డి సోమవారం బుక్లెట్ విడుదల చేశారు. టీఎస్ఎస్పీలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చిన అడిషనల్ డీజీ అభిలాష బిస్త్ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఏడీజీ సీఐడీ గోవింద్‌సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్, నిజామాబాద్ రేంజ్‌ల ఇన్చార్జి డీఐజీగా కమల్‌హాసన్‌రెడ్డి హైదరాబాద్, నిజామాబాద్ రేంజ్‌ల ఇన్చార్జి డీఐజీగా 2004 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వీబీ కమల్‌హాసన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వెస్ట్‌జోన్ ఐజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి నాగిరెడ్డిని కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.