న్యూఢిల్లీ: ప్రీమియం బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫిల్డ్.. 26,300 యూనిట్ల క్లాసిక్ 350 మోటర్‌సైకిళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్రేక్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 1, డిసెంబర్ 5 మధ్యకాలంలో తయారైన ఈ 26 వేల యూనిట్ల బైకుల బ్రేకుల్లో సాంకేతిక సమస్యలు గుర్తించినట్లు వెల్లడించింది.