WTC25 – IND v BAN | బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది.
బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ శాంటో(82) హాఫ్ సెంచరీ చేయగా.. మిగతా బ్యాటర్లందరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఇక భారత బౌలర్లలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు. ఇక రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది.
Ravichandran Ashwin’s six-wicket haul leads India to an emphatic win in Chennai 🤩#WTC25 | #INDvBAN ➡️ https://t.co/akLigwiJZ7 pic.twitter.com/DPVxiLjNkW
— ICC (@ICC) September 22, 2024