Rangareddy : న్యాయం చేయాలని ఆత్మహత్యాయత్నం..

యాచారం : అక్రమంగా తమ భూమిని కొంతమంది పట్టా చేసుకున్నారని, తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని తులేఖుర్ధు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబందించి గ్రామస్తులు, పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. తులేఖుర్ధు గ్రామానికి చెందిన ఏశమోని బుచ్చయ్య, లక్ష్మయ్యలకు 378, 381, 382 సర్వే నంబర్లలో 5 ఎకరాల 28గుంటల వ్యవసాయ భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన ఏశమోని మల్లయ్య వారసులు సత్తయ్య, రాములు, కళమ్మ కలిసి బుచ్చయ్య, లక్ష్మయ్యలకు చెందాల్సిన 5 ఎకరాల 28 గుంటల భూమిని 2018లో తప్పుడు రికార్డులను సృష్టించి అక్రమంగా వారి పేరుమీద చేయించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
1950నుంచి కబ్జాలో ఉన్న బుచ్చయ్య, లక్ష్మయ్యల భూమి వివరాలను రెవెన్యూ రికార్డుల నుంచి సైతం తొలగించి వేసినట్లు బాధితులు పేర్కొన్నారు. బుచ్చయ్య భూమిని తన నలుగురు కూతుర్లకు పంచివ్వాలని వారి పేర్లమీద రిజిస్ట్రేషన్ చేద్దామని వెళ్లగా తమ పేరు మీద భూమి లేదని రికార్డుల్లో తేలింది. దీంతో షాక్‌కు గురైన బాధితుడు బుచ్చయ్య, లక్ష్మయ్యలు పలుమార్లు తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులిచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. తమ గెదేలను సైతం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందుంచి నిరసన తెలిపారు. కుటుంబ సభ్యులు కిరోసిన్ డబ్బాతో వచ్చి హల్చల్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటామని ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రెండు కుటుంబాలకు చెందిన వారు ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడ్డారు.
బుచ్చయ్య, లక్ష్మయ్య కుటుంబ సభ్యులతో మల్లయ్య కుటుంబ సభ్యులు ఒకరికోకరు ఘర్షనకు దిగారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న సర్పంచ్ సబిత, మాజీ సర్పంచ్ సత్యపాల్, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వెంటనే ఎస్ఐలు పద్మయ్య, ప్రభాకర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే అక్రమంగా పట్టా మార్పిడి సాధ్యమైందని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమ భూమిని తమకు అప్పగించాలని కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

