Rangamarthanda | రంగమార్తాండకు సూపర్‌క్రేజ్.. కృష్ణవంశీ టీం భారీ కటౌట్స్
డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshi) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం రంగమార్తాండ (Rangamarthanda). నేడు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshi) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం రంగమార్తాండ (Rangamarthanda). మరాఠీలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న నట సామ్రాట్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని శాంతి థియేటర్ వద్ద ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, డైరెక్టర్ కృష్ణవంశీల 40 అడుగుల భారీ కటౌట్స్ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
రంగమార్తాండలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. హౌస్‌ఫుల్ మూవీస్-రాజ శ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. రంగమార్తాండకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. మన అమ్మానాన్నల కథ.. ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం కృష్ణవంశీ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోనుందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
రంగమార్తాండ రాఘవరావు (ప్రకాష్ రాజ్) అనే థియేటర్ ఆర్టిస్ట్ చుట్టూ తిరిగే కథాంశంతో సాగుతుంది. రంగస్థల కళాకారుడిగా చేసిన సేవలకుగాను ఆయన రంగమార్తాండ అనే బిరుదు అందుకుంటాడు. రాఘవరావు వయస్సు మీద పడుతున్న నేపథ్యంలో రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత క్రమంలో రాఘవరావు, పిల్లలకు మధ్య ఎలాంటి డ్రామా జరిగిందనే స్టోరీతో భావోద్వేగ సన్నివేశాలతో సాగుంది. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం నటన ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందంటున్నారు సినీ జనాలు.
Read Also :
Naresh 61 | జాతిరత్నాలు బ్యూటీతో అల్లరి నరేశ్ కొత్త సినిమా.. వివరాలివే
NBK 108 | స్టైలిష్ మాస్ అవతార్‌లో బాలకృష్ణ.. ఎన్బీకే 108 ఫస్ట్ లుక్స్ వైరల్
Miss Shetty Mr Polishetty | Miss శెట్టి మిస్టర్ Polishetty నుంచి నోనోనో లిరికల్ సాంగ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

