రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు శనివారం పండంటి కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. ఈ శుభవార్తతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. రామ్‌చరణ్ ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మాకు బాబు, పాప పుట్టారనే విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడిని కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. మన జీవితంలో మహిళలే గొప్ప బలం. మాకు అండగా నిలిచిన కుటుంబం, అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు’ అని రామ్‌చరణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ పోస్ట్‌కు ఉపాసన గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోను జత చేశారు. ఈ దంపతులకు ఇప్పటికే కూతురు క్లీంకార ఉన్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో సోషల్‌మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసిన చిరంజీవి…ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు. హనుమాన్ కృపతో కవలలు జన్మించారని, ఉపాసనతో పాటు పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.