Chiru- Charan | మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రస్తుతం లండన్‌లో సందడి చేస్తున్నారు. ఈ రోజు రామ్ చరణ్ అతని పెంపుడు కుక్క రైమ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉండగా, దీని కోసం నాలుగు రోజుల ముందే రామ్ చరణ్, చిరంజీవి, సురేఖ, ఉపాసన అంతా లండన్‌కి వెళ్లారు. లండన్ లోని మెగా అభిమానులు రాంచరణ్ కి ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హంగామా చేయడం మనం చూశాం. అయితే విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా లండన్‌లో మెగా ఫ్యాన్స్ సందడి చేశారు. చిరంజీవి, రామ్ చరణ్‌లతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మన దగ్గరే కాదు విదేశాలలోను ఈ మెగా హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి మురిసిపోతున్నారు.
రాంచరణ్ స్టైలిష్ లుక్ అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మేడం టుస్సాడ్స్ లో రామ్ చరణ్ స్టాచ్యూ లాంచ్ కావడం అరుదైన గౌరవం అని చెప్పాలి. గతంలో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు లాంచ్ కాగా, ఇప్పుడు ఆ జాబితాలో రామ్ చరణ్ కూడా చేరాడు.చరణ్ మైనపు విగ్రహం లాంచ్ అవుతుండడడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతున్నారు. ఎంతో గౌరవం, గర్వంగా భావించే ఈ జాబితాలో చరణ్ చేరడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విగ్రహాన్ని త్వరలోనే సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు. శాశ్వతంగా అక్కడే ప్రదర్శనకు ఉంచుతారు.
మరోవైపు మే 11న రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘RRR’ సినిమాను ప్రదర్శించనున్నారు. అక్కడ కీరవాణితో RRR సాంగ్స్ ఆర్కెస్ట్రా నిర్వహించనున్నారు.. ఆ తర్వాత రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్‌లతో క్వశ్చన్స్, ఆన్సర్స్ కార్యక్రమం కూడా ఉంటుందని టాక్..ఈ ఈవెంట్ కూడా చూసుకొని చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు తిరిగి ఇండియాకి రానున్నారు. అయితే ప్రస్తుతం ఇండియా- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో కొన్ని ఎయిర్‌పోర్ట్‌లు కూడా మూసేసారు. మరి ఇలాంటి పరిస్థితులలో వారు ఇండియాకి ఎలా చేరుకుంటారని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాతో బిజీగా ఉండగా, చిరంజీవి విశ్వంభర మూవీని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.
Boss MegaStar @KChiruTweets Garu In London, With Fans ❤️❤️❤️❤️#MegaStarChiranjeevi #RamCharan pic.twitter.com/BvYCn9HHlq
— Praveen (@AlwaysPraveen7) May 9, 2025