కలెక్టర్ టీనా దాబి ఫోటోతో వాట్సాప్ వసూళ్లు.. వ్యక్తి అరెస్టు
దుంగార్పూర్: రాజస్థాన్‌లోని దుంగార్పూర్కు చెందిన ఓ యువకుడు.. జైసల్మేర్ కలెక్టర్ టీనా దాబి ఫోటోను వాట్సాప్‌లో వాడి మోసాలకు పాల్పడ్డాడు. ఆ యువకుడిని ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మొబైల్ నెంబర్‌తో వాట్సాప్ ఓపెన్ చేసి, దాంట్లో ఐఏఎస్ టీనా దాబి ఫోటోను డీపీగా పెట్టాడు. ఇక ఆ నెంబర్‌తో గుర్తు తెలియని వ్యక్తులకు మెసేజ్‌లు చేసి, అమెజాన్ గిఫ్ట్ కార్డులు పంపాలంటూ సందేశాలు చేశాడు. అయితే అక్షర దోషం లేని ఇంగ్లీష్ భాషలో మెసేజ్ చేయడం వల్ల.. చాలా మంది కలెక్టరే గిఫ్ట్ కార్డులు అడిగిందే ఏమో అని రెస్పాన్స్ ఇచ్చేశారు.
ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర అర్బన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు సెక్రటరీ సునితా చౌదరీకి కూడా అమెజాన్ గిఫ్ట్ కార్డు పంపాలంటూ మెసేజ్ వెళ్లింది. బహుశా టీనా దాబినే ఆ మెసేజ్ చేసి ఉంటుందని తొలుత సునితా చౌదరీ భావించింది. కానీ కన్ఫర్మేషన్ కోసం టీనా దాబికి ఫోన్ చేసిందామె. ఈ విషయాన్ని తెలుసుకున్న జైసల్మేర్ కలెక్టర్ టీనా దాబి షాకైంది. సదరు విషయాన్ని స్థానిక ఎస్పీకి తెలియజేసింది. ఓ సైబర్ బృందం రంగంలోకి దిగి టీనా దాబి ఫోటోతో వసూళ్లకు పాల్పడుతున్న దుంగార్పూర్ యువకుడిని అరెస్టు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

