Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలమైంది.
Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ సినిమా ఫలితంపై తాజాగా స్పందించారు. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి గల కారణాలను వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో సినిమాను విడుదల చేయడం తాము చేసిన తప్పిదాల్లో ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లో ‘గరివిడి లక్ష్మి’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీజీ విశ్వప్రసాద్‌కు ‘రాజా సాబ్’ ఫలితంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై ఆయన స్పందిస్తూ, సినిమా ఫలితం గురించి మాట్లాడటం వల్ల తన మూడ్ ఏమీ మారదని అన్నారు. అయితే విడుదల సమయం విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ‘రాజా సాబ్’ను సంక్రాంతి సీజన్లో కాకుండా మరో సమయంలో విడుదల చేసి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సినిమా ఫలితాన్ని ప్రభావితం చేసిన అంశం విడుదల తేదీ ఒక్కటే కాదని, విడుదల సమయంలో ఎదురైన ఇతర సమస్యలు కూడా ఉన్నాయని వివరించారు. సినిమా విడుదల రోజున ప్రీమియర్లు ఆలస్యం కావడం, టికెట్ ధరల పెంపునకు ప్రయత్నించడం వంటి పరిణామాలు ప్రేక్షకులపై ప్రభావం చూపాయని విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
తమ నిర్మాణ సంస్థలో టికెట్ ధరలను పెంచేందుకు ప్రయత్నించిన తొలి సినిమా ‘రాజా సాబ్’ అని ఆయన వెల్లడించారు. ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.ప్రీమియర్ల ఆలస్యం కారణంగా ప్రేక్షకులు అసౌకర్యానికి గురయ్యారని, ఈ పరిణామాలు కూడా సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయని ఆయన అంగీకరించారు. అంటే, విడుదల సమయం, టికెట్ ధరలు, ప్రదర్శనల నిర్వహణలో ఎదురైన సమస్యలు కలిసి సినిమాపై ప్రభావం చూపాయని నిర్మాత వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ప్రభాస్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, మారుతి దర్శకత్వం, హారర్ కామెడీ కథాంశం కారణంగా ‘రాజా సాబ్’పై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.208 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

