CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
CJP Leaders: ఢిల్లీలోని జంతర్ మంతర్‌లోకి చొరబడిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను ప్రివెన్టివ్ కస్టడీలోకి తీసుకున్నారు. అయిదు రోజుల పాటు సీజేపీ నేతలు జుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. మరో నేత అజింక్య షిండే కూడా పోలీసులు కస్టడీలోకి వెళ్లాడు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్‌లోకి చొరబడిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు(CJP Leaders) సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను ప్రివెన్టివ్ కస్టడీలోకి తీసుకున్నారు. అయిదు రోజుల పాటు సీజేపీ నేతలు జుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. మరో నేత అజింక్య షిండే కూడా పోలీసులు కస్టడీలోకి వెళ్లాడు. బెయిల్ షరతును ఉల్లంఘించి, ప్రజా వ్యవహారాలకు అవరోధంగా మారినట్లు వారిపై కేసు బుక్ చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని మందిర్ మార్గ్‌లో ఉన్న మెజిస్ట్రేట్ ముందు ఆ ముగ్గురు నేతల్ని ప్రవేశపెట్టారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇవాళ తన ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఆశు, సౌరవ్‌లను 5 రోజుల కస్టడీలోకి తీసుకున్నట్లు చెప్పారు. జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను ప్రదర్శించడమే వాళ్లు చేసిన తప్పా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేకతను అణిచివేసే విధానం ఇది కాదన్నారు. ప్రధాని మోదీ గారు మీకు ధైర్యం ఉంటే ఎమర్జెన్సీ ప్రకటించాలని దీప్కే పేర్కొన్నారు.
Ashu and Saurav have been sent to 5 days judicial custody.
Their fault? Unfurling tricolour at Jantar Mantar.
Show some guts, @narendramodi. If you’re so determined to crush dissent, have the courage to officially declare an Emergency instead of hiding behind these cowardly tactics.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 14, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

