Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
Pope Leo XIV: పోప్ లియో XIVకు ఊపిరితిత్తుల క్యాన్సర్ శస్త్రచికిత్స చేశారు. ఆయన కుడి ఊపిరితిత్తిపై పెరిగిన కణితిని తొలగించారు. మంగళవారం సుమారు 90 నిమిషాల పాటు సర్జరీ చేశారు.
వాటికన్: పోప్ లియో XIV(Pope Leo XIV)కు ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స చేశారు. ఆయన కుడి ఊపిరితిత్తిపై పెరిగిన కణితిని తొలగించారు. మంగళవారం సుమారు 90 నిమిషాల పాటు సర్జరీ చేశారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో ఆయన మళ్లీ నిద్రలేచినట్లు వాటికన్ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఆ కణితి వల్ల క్యాన్సర్ విస్తరించిందా లేదా అని తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు చేయనున్నట్లు వాటికన్ వర్గాలు పేర్కొన్నాయి. కుడి ఊపిరితిత్తికి చెందిన కిందభాగంలో పెరిగిన కణితిని తొలగించినట్లు చెప్పారు. డయాగ్నస్టిక్ పరీక్షల్లో పోప్ లియోకు పల్మోనరీ అడినోకార్సినోమా సోకినట్లు గుర్తించారు.
సుమారు మూడు గంటల పాటు పోప్ను ఆపరేషన్ రూమ్లో ఉంచారు. సర్జరీ సక్సెస్ అయ్యిందని, ఎటువంటి ఫిర్యాదులు లేవని వాటికన్ వెల్లడించింది. ప్రోసిజర్ ముగిసిన తర్వాత పోప్ డిన్నర్ రిక్వెస్ట్ చేశారని వాటికన్ వర్గాలు పేర్కొన్నాయి. రోమ్లో ఉన్న గెమేలి ఆస్పత్రి 10వ అంతస్తులో ఆయన కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోనున్నారు. పోప్ నిర్వహించే సామూహిక ప్రార్థనలను అక్టోబర్ 20వ తేదీ వరకు రద్దు చేశారు. వచ్చే నెలలో జరగనున్న దక్షిణ అమెరికా పర్యటనపై ఇంకా క్లారిటీ లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

