ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్, అక్టోబర్ 30( నమస్తే తెలంగాణ)/ మంచాల: ఆధునిక పద్ధతుల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్లకు చెందిన వంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని రైతునేస్తం అవార్డు వరించింది. శనివారం ఏపీలోని కృష్ణా జిల్లా స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డును అందుకొన్నారు. శ్రీనివాస్‌రెడ్డి తనకున్న 10 ఎకరాల్లో సాగు చేసిన డ్రాగన్ ఫ్రూట్‌తో లాభాలు ఆర్జిస్తున్నారు. తోటి రైతులను డ్రాగన్ ఫ్రూట్ సాగు దిశగా చైతన్యపరుస్తున్నారు. లాభాల సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఆయనకు రైతునేస్తం అవార్డు దక్కింది. రైతులకు మేలు రకం, కల్తీ లేని విత్తనాలు అందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శివప్రసాద్‌కు సైతం రైతునేస్తం పురస్కారం దక్కింది.