ముంబై: రాహుల్ త్రిపాఠి కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో .. సన్‌రైజర్స్ ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి.. గాల్లోకి ఎగురుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో బ్యాటర్ శుభమన్ గిల్.. ఆఫ్ సైడ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. చాలా వేగంగా ఆ బంతి గాల్లో కవర్స్ మీదుగా బౌండరీ దిశగా వెళ్తోంది. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్.. తన ఎడమ వైపుకు దూకి .. ఎడమ చేతితో బంతిని క్యాచ్ పట్టేశాడు. అద్భుతంగా ఆ క్యాచ్‌ను అందుకోవడంతో గిల్ నిరాశచెందాడు. ఆ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఇదే. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు గుజరాత్‌పై గెలుపొందింది.
Rahul tripathi stunning catch… #GTvsSRH #SRHvGT pic.twitter.com/UA0focDkgi
— Chinthakindhi Ramudu (O- Negitive) (@RAMURAVANA) April 11, 2022