మరి కొద్ది రోజులలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తమిళనాట ప్రచారం జోరుగా సాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా రాధా రవి తన పార్టీ ప్రచారంలో భాగంగా నయనతారను మధ్యలోకి తీసుకొచ్చారు. నయనతార.. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు హీరో ఉదయనిధి స్టాలిన్ తో సహజీవనం చేస్తుందని సంచలన కామెంట్స్ చేశారు. గతంలోను ఆయన నయనతారపై నెగెటివ్ కామెంట్స్ చేశారు. శ్రీరామరాజ్యం సినిమాలో నయనతార సీత పాత్ర పోషించింది. అలాంటి వాళ్లు కూడా సీత పాత్ర లు పోషిస్తున్నారని అన్నారు.
అయితే రాధారవికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి స్పందించింది. రాధారవి అనాలోచిత కామెంట్స్‌తో అలసిపోయాను. బహిరంగాగానే అతను మహిళలను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఒక పార్టీ అతన్ని స్టార్ క్యాంపెయినర్‌గా ఎందుకు నియమించింది? రాజా రవి లాంటి వారికి ఓటు వేసి అధికారంలో కూర్చోపెడుతున్నాం అంటూ చిన్మయి అతనిపై స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది.
#RadhaRavi the star campaigner of B.J.P hasn't learned his lesson nor would never learn I suppose… He yet again shames #Nayanthara in a stage!!
— Visvesh ✨ (@PawPawVee) March 31, 2021
I wonder how can he get away with such disgusting, disgraceful, ill talks on one of South India's biggest actors…!! https://t.co/cwFsEFPuub pic.twitter.com/7hia5FfVDU