కుక్కల కిరాణా దుకాణం
ఆ అమ్మాయికి పెద్ద కష్టమే వచ్చింది. తన ప్రాణానికి ప్రాణమైన పెంపుడు కుక్క సారాకు అవసరమైన వస్తువులు మార్కెట్లో ఎక్కడా దొరకలేదు. మాల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో, ఢిల్లీకి చెందిన రాశి నారంగ్ తనే ఆ కొరత తీర్చాలనుకున్నది. హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్ (హుఫ్ట్) పేరుతో పెంపుడు కుక్కలకు పనికొచ్చే రోజువారీ వస్తువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. తొలినాళ్లలో వాటిని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు.

దుకాణదారులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో తానే నేరుగా అమ్మే ప్రయత్నం చేసింది. ఇంతలో భర్తకు సింగపూర్ బదిలీ కావడంతో ఓ ఏడేండ్ల విరామం వచ్చింది. అయినా రాశి నిరాశపడలేదు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత వ్యాపారాన్ని విస్తరించడం మొదలుపెట్టింది. 2022 చివరికి హుఫ్ట్ స్టోర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 75కు చేరుకుంది. పెంపుడు జంతువుల కోసం 30 స్పాలు కూడా ప్రారంభించింది రాశి. నటి కృతి సనన్ దీనికి బ్రాండ్ అంబాసిడర్.
పిల్లులు, కుక్కల విసర్జితాలను శుభ్రం చేయడం వాటి యజమానులకు పెద్ద సమస్య. ఈ ఇబ్బందికి రాశి ఓ పరిష్కారం కనిపెట్టింది. ‘హుఫ్ట్’ తయారు చేసిన ఓ రకమైన పొడిని దాని మీద చల్లితే చాలు. క్షణాల్లో గట్టిపడిపోతుంది. దుర్వాసన కూడా మాయం. ఇబ్బందిలేకుండా ఎత్తిపడేయవచ్చు. ఇలాంటి సరికొత్త ఐడియాలు అమలు చేస్తున్నది కాబట్టే.. హుఫ్ట్ వ్యాపార టర్నోవర్ రూ. 277 కోట్లకు చేరుకుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?