Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టగా.. వీటిలో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వంలో వహిస్తున్నాడు.
తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న భామల్లో ఒకరు రాశీఖన్నా. తెలుగు, తమిళ భాషల్లో లీడింగ్ యాక్టర్లతో కలిసి నటిస్తూ ఎప్పటికప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంది. ఈ బ్యూటీ ఇటీవలే తెలుసు కదా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
రాశీఖన్నా తొలిసారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్‌లో ఈ మూవీ గురించి మాట్లాడింది. ఈ మూవీ గురించి ఆసక్తికర విషయం చెప్పి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. తన కెరీర్లో మొదటిసారి స్క్రిప్ట్ వినకుండా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంతకం చేశానంది.
నాకు పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలని ఎప్పుడూ ఉండేది. హరీష్ శంకర్ నాకు ఉస్తాద్ భగత్ సింగ్ రోల్ ఆఫర్ చేసిన వెంటనే అసలు కథ కూడా వినకుండా ఒకే చెప్పేశా. ఆఫర్ వచ్చినప్పుడు చాలా థ్రిల్ అయ్యా.. పవన్ కల్యాణ్ నిజంగా చాలా పవర్ ఫుల్, ఆయన ఎప్పుడూ సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తుంటారు..ఆయన గొప్ప మానవతావాది అని చెప్పుకొచ్చింది రాశీఖన్నా.. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్‌లో నటిస్తుండగా.. రాశీఖన్నాకీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ స్టైల్ ఆఫ్ మ్యానరిజంతో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.