QS Rankings | క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్- 2027.. 76 స్థానాలు మెరుగుపరచుకున్న ఐఐటీ హైదరాబాద్
ప్రపంచ ఉన్నత విద్యాసంస్థలపై క్యూఎస్ (QS) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027 ఇటీవల విడుదలైంది. దీనిలో 52 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు లభించింది. ఐఐటీ ఢిల్లీ దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. ఐఐటీ హైదరాబాద్ 76 స్థానాలు మెరుగుపరుచుకుంది. ఈ ర్యాంకింగ్స్ గురించి పోటీ పరీక్షల్లో అడుగుతుంటారు.
క్యూఎస్ (QS) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్- 2027లో మొత్తం 52 భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ప్రపంచంలో అత్యధిక విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం లభించిన దేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
వరల్డ్ టాప్ టెన్ సంస్థలు
మసాచుచెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (USA) మొదటి స్థానంలో నిలువగా.. రెండో స్థానంలో ఉమ్మడిగా ఇంపీరియల్ కాలేజీ (UK), స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ (యూఎస్ఏ) నిలిచాయి. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ (యూకే) 4, హార్వర్డ్ యూనివర్సిటీ (యూఎస్ఏ) 5, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (యూకే) 6, క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (యూఎస్ఏ) 7, ETZ జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), యూనివర్సిటీ కాలేజీ లండన్ (యూకే) ఉమ్మడిగా 8, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (సింగపూర్) 10వ స్థానాల్లో ఉన్నాయి.

Qs India
ఐఐటీ ఢిల్లీ 118వ ర్యాంకును సాధించి వరుసగా రెండో ఏడాది దేశంలోనే నంబర్ వన్ విద్యాసంస్థగా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఐదు స్థానాలు మెరుగుపరుచుకుంది. అలాగే ఐఐటీ బాంబే 134, ఐఐటీ మద్రాస్ 170వ ర్యాంకులో నిలిచాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ 205, ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ కాన్పూర్ ఉమ్మడిగా 221, ఢిల్లీ యూనివర్సిటీ 322, ఐఐటీ రూర్కీ 335, ఐఐటీ గువాహటి 349, శూలిని యూనివర్సిటీ 452వ ర్యాంకులో ఉన్నాయి.
ఐఐటీ హైదరాబాద్ 588వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే 76 స్థానాలు మెరుగుపరుచుకుంది.
ఆసియా ర్యాంకింగ్స్‌లో తెలంగాణ
QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్- 2027లో తెలంగాణ విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ హైదరాబాద్ 251, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 270, ఉస్మానియా యూనివర్సిటీ 650, వోక్సెన్ యూనివర్సిటీ 499, ఎన్ఐటీ వరంగల్ 624వ ర్యాంకుల్లో నిలిచాయి.
Read Today's Latest Current-affairs News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
QS Rankings | క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్- 2027.. 76 స్థానాలు మెరుగుపరచుకున్న ఐఐటీ హైదరాబాద్
The Breaking News | డిసెంబర్ 11న ‘ది బ్రేకింగ్ న్యూస్’ రిలీజ్.. ట్రైలర్‌తో ఆసక్తి పెంచిన మురళీ మోహన్, అనన్య నాగళ్ల
Nirmala Sitaraman | డబ్బులు లేకపోవడం ఒక్కటే పేదరికం కాదు.. కేంద్ర ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు..!
YSRCP complaints | పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలపై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
క్షుద్రపూజల కోసం.. పొరుగువారి కుమార్తెను చంపిన మహిళ
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

