PV Sindhu: బ్రాంజ్ గెలుస్తుందా? చైనా ప్రత్యర్థిపై ఆమె రికార్డ్ ఏంటి?
ఆమె బ్రాంజ్ మెడల్ కోసం తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థి చైనాకు చెందిన హి బింగ్జియావో. మరి ఆమెను సింధు ఓడించి కనీసం బ్రాంజ్ అయినా గెలుస్తుందా?

టోక్యో: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలవాలన్న స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) ఆశలు నెరవేరలేదు. సెమీస్‌లో వరల్డ్ నంబర్ వన్ తాయ్ జు చేతిలో వరుస గేమ్స్‌లో ఆమె ఓడిపోయిన సంగతి తెలుసు కదా. ఈ మెగా ఈవెంట్లో టాప్ ఫామ్‌లో ఉన్న సింధు.. వరుసగా నాలుగు మ్యాచ్‌లను ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా గెలవడంతో సెమీస్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది. కానీ వరల్డ్ నంబర్ వన్ అటాకింగ్ గేమ్ ముందు నిలవలేకపోయింది. ఇక ఆదివారం ఆమె బ్రాంజ్ మెడల్ కోసం తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థి చైనాకు చెందిన హి బింగ్జియావో. మరి ఆమెను సింధు ఓడించి కనీసం బ్రాంజ్ అయినా గెలుస్తుందా? ఇప్పటి వరకూ బింగ్జియావోపై సింధు రికార్డు ఎలా ఉంది?
బింగ్జియావోదే పైచేయి
సింధు వరుసగా తన రెండో ఒలింపిక్ మెడల్ కోసం చూస్తుండగా.. ప్రత్యర్థి బింగ్జియావో తన తొలి మెడల్ కోసం ఆరాటపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు రికార్డు చూసుకుంటే చైనా ప్లేయర్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ 15సార్లు తలపడగా 9సార్లు బింగ్జియావో, 6సార్లు సింధు గెలిచింది. ఒకదశలో సింధుపై వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. అయితే 2019 వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సింధు 21-19, 21-19తో బింగ్జియావోపై గెలిచి పరాజయం పరంపరకు అడ్డుకట్ట వేయగలిగింది. ప్రస్తుతం సింధు 7వ ర్యాంక్‌లో, బింగ్జియావో 9వ ర్యాంక్‌లో ఉంది.
ఈ మ్యాచ్‌లో పైచేయి ఎవరిది?
గతంలో సింధు బ్యాక్‌హ్యాండ్‌పై ఎక్కువగా ఆడేలా చేసి బింగ్జియావో పైచేయి సాధించింది. అయితే సింధు గతేడాది ఈ బలహీనతపై దృష్టిసారించి దీనిని అధిగమించింది. అలాగే ఈ మధ్య తన నెట్‌ప్లేను కూడా సింధు మెరుగుపరచుకుంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు ముందు బింగ్జియావో రెండు వరుస మ్యాచ్‌లలో మూడేసి గేమ్‌లు తలపడి అలసిపోయింది. ఈ మ్యాచ్ కూడా మూడు గేమ్‌ల పాటు సాగితే ఆమె పూర్తి సామర్థ్యం మేరకు ఆడకపోవచ్చు. ఈ అంశాలు సింధుకు కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. దూర్దర్శన్, సోనీ సిక్స్‌లో లైవ్ చూడొచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

