అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో జాలీరెడ్డి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు శాండల్‌వుడ్ నటుడు ధనంజయ. ఆయన నటించిన కన్నడ సినిమా ‘బడవ రాస్కెల్’ అదే పేరుతో తెలుగు తెరపైకి రాబోతున్నది.. శ్రీమతి గీతా శివరాజ్‌కుమార్ సమర్పణలో దర్శకుడు శంకర్ గురు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 18న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నటుడు ధనంజయ సినిమా విశేషాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..‘కన్నడలో ‘బడవ రాస్కెల్’ సినిమా విజయవంతమై 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేస్తున్నాం. మధ్యతరగతి కుటుంబం నేపథ్యంతో ఆకట్టుకునేలా సినిమా సాగుతుంది. ‘పుష్ప’ చిత్రంలో నా పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాతోనూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తానని ఆశిస్తున్నాను. హీరోగానే కాదు ప్రతి నాయకుడిగానూ పేరు తెచ్చుకోవాలని ఉంది’ అన్నారు.